Header Banner

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణంలో మంత్రి నారా లోకేష్ దంపతులు! స్వామివారికి పట్టువస్త్ర సమర్పణ!

  Fri Mar 14, 2025 09:31        Politics

యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 12 గంటలకు నిర్వహించిన స్వామి వారి కల్యాణమహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామివారికి ప్రభుత్వం తరఫున నారా లోకేష్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోఛ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య వైభవంగా జరిగిన స్వామి వారి కల్యాణాన్ని కనులారా వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివార్లకు విష్వక్షణ ఆరాధన, పుణ్యాహవాచనం రక్షాబంధనం, మధుపర్క నివేదన, స్వామివారి పాదపక్షాలన, విశేష అర్చన, మహా సంకల్పం, ముత్యపు తలంబ్రాలు, బ్రహ్మముడి, మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ దంపతుల రాకను పురస్కరించుకుని ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అంతకుముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామ దేవాలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ దంపతులకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి: గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్‌ రంగం... అసలు నిజాలు బయటకు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

 

ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ !

 

బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #narisimhaswamy #temple #Naralokesh #todaynews #flashnews #latestnews